TRINETHRAM NEWS

తప్పుచేసి తప్పు తప్పు అనడం వైసిపి నాయకుల తప్పు.

వైసీపీ హయంలో రద్దయిన జీవో నెంబర్ 3 పై అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. భారత్ ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు – మొట్టడం రాజబాబు.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తప్పు చేసి, ఇప్పుడు తప్పు, తప్పు అనడం తప్పని భారత ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుని తప్పుబట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిఓనెం 3 ని, సుప్రీంకోర్టు రద్దు చేయగా అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యామ్నాయ జిఓ తీసుకొనిరావొచ్చు లేదా, షెడ్యూల్డ్ ప్రాంత నియమకాల చట్టం తీసుకొనిరావొచ్చని, తీసుకొని రమ్మని అప్పటి గిరిజన శాసన సభ కమిటీ అధ్యక్షుడైనా తెల్లం బాలరాజు గారి ద్వారా అప్పటి ముఖ్యమంత్రికి తెలియపర్చినప్పటికి, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెదేపా అధినేత చంద్రబాబు అరకు బహిరంగ సభలో జిఓనెం 3 ని తీసుకొస్తానన్నప్పటికి అరకు పార్లమెంట్,అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలలో వైయస్సార్ సిపికి ఆదివాసీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు.

మొత్తం ఏడు గిరిజన నియోజకవర్గాలు ఉండగా రెండు తప్పా మిగతా ఐదు నియోజకవర్గాలు కూటమి గెలిచింది. ఒక వైపు జిఓనెం 3 ఇస్తానన్న ఓట్లు వేయకుండా,అవకాశం ఉన్నప్పటికి కొత్త జిఓ కానీ, కొత్త చట్టం కానీ ఇవ్వని పార్టీకి ఓటు వేసిన ఆదివాసీల పరిస్థితి పుట్టింటోడు తరిమేసాడు, కట్టుకున్నోడు వదిలేసాడు అన్న విదంగా ఉంది. అయితే ఆదివాసీల ఓట్లు వేయించుకొన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు,ఎంపీ ఆదివాసీల పక్షాన ముఖ్యమంత్రిని కలిసి ఆదివాసీల వేదన,ఆవేదనను తెలియపర్చి,ప్రాధేయపడి కొత్త జిఓని కానీ, చట్టాన్ని కానీ తీసుకొని రావాలి కానీ మీరు జగన్నామస్వరంతో ఉంటే ఆదివాసీలకు తీవ్రనష్టం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డి విమర్శించినట్లు ఆదివాసీ ప్రతినిధులుగా మీరు విమర్శిస్తే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు రావొచ్చెమో గానీ, మీ వల్ల ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎన్నికల్లో రాజకీయం, మిగతా సమయంలో లాబియింగ్ చేయకపోతే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App