TRINETHRAM NEWS

బాధ్యుల పై కఠినంగా చర్యలు తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించి శిశువు మరణానికి కారణమైన బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు

భూపాలల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత మహిళలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు, జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాటారం మండలo లోనీ దంతాలపల్లి గ్రామానికి చెందిన తోట హరిత గత సోమవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీ కోసం అడ్మిట్ అవ్వగా డాక్టర్ మౌనిక సాధారణ డెలివరీ అవుతుందని చెప్పి మూడు రోజులు హాస్పిటల్ లో ఉంచి సరి అయిన వైద్యం అందించక పోవడంతో కడుపులో శిశువు చనిపోవడం జరిగిందని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మరణించిందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రు లో సరైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు. సమస్యలపై స్పందించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్ ,స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App