TRINETHRAM NEWS

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలి *అదనపు కలెక్టర్ డి.వేణు

పెద్దపల్లి, నవంబర్ -04: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు ప్రజల దరఖాస్తులను స్వీకరించారు.

సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజేశ్వరరావు సర్వే నెంబర్ 331 బి,సి లో ఉన్న సుమారు నాలుగు ఎకరాల వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నానని, మానేరు చెక్ డాం వల్ల తన పొలంలోకి నీళ్లు వస్తున్నాయని, తన భూమికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించి తగిన న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి నీటిపారుదల శాఖ ఈఈ రాస్తూ పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ జంగాలపల్లి చెందిన బర్ల లక్ష్మి తమ డివిజన్లో డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెద్దపల్లి మున్సిపాలిటీ టీచర్ల కాలనీకి చెందిన ఈర్ల సంపత్ పెద్దపల్లి మార్కెట్ వెనక నూతనంగా నిర్మిస్తున్న మురికి కాలువకు ప్రధాన కాలువ కనెక్ట్ చేయకుండా నేరుగా తన ఇంటి ఎదురుగా వచ్చే విధంగా పనులు ప్రారంభించారని, దీనివల్ల రానున్న రోజుల్లో కాలనీలో మురికి నీరు వస్తుందని, ప్రధాన కాలువకు కలిసే విధంగా డ్రైనేజీ దేశ మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అదనప కలెక్టర్ ఆదేశించారు
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App