అమరవీరుల జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన సిపిఐఎం గోదావరిఖని పట్టణ రెండవ మహాసభలు
ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్
అతిథులుగా హాజరైన పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పట్టణ రెండవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మరియు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని నెలలుగా ఇల్లు లేని నిరుపేదలందరు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు వేసుకొని ఉంటున్న వారికి తక్షణమే పట్టాలివ్వాలని అదే విధంగా పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఎస్ టి పి ఏర్పాటులో భాగంగా గంగా నగర్ లో తొలగించిన ఇండ్ల వారికి ఎమ్మెల్యే చొరవ తీసుకొని వెంటనే వారికి స్థలాలు ఇచ్చి పట్టాలి ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ జిల్లా కార్యదర్శి వై యాకయ్య, (కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రాంగణం) గంగానగర్ మల్లు స్వరాజ్యం కాలనీ లో గోదావరిఖని పట్టణ రెండో మహాసభ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మహాసభల సందర్భంగా ముందుగా జెండా ఆవిష్కరణ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు నరివిట్ల నరసయ్య ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు ఫ్రీ బస్సు పథకం తప్ప ఇచ్చిన 06 గ్యారంటీలో ఏవి కూడా ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు. కాబట్టి వెంటనే ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాలని అన్నారు అదే విధంగా రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాక్ లను ప్రైవేటుపరం చేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కానీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదని కాబట్టి వెంటనే ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకపోతే రానున్న రోజుల్లో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ ఎల్లప్పుడు ముందుండి పోరాడుతుందని అందులో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి అభివృద్ధి చెందాలని తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించే విధంగా పోరాటాలు నిర్వహించాలని ప్రైవేటీకరణ ఆపాలని కాంటాక్ట్ కార్మికులందరికీ రెగ్యులరేషన్ చేయాలని కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు, సింగరేణి ఉద్యోగస్తులు అందరికీ సొంతిల్లు అమలు చేయాలని ప్రతి సింగరేణి ఉద్యోగస్తుల కుటుంబానికి 250 స్థలం కేటాయించి 30 లక్షల వడ్డీ లేని రుణం సింగరేణి యాజమాన్యం ఇవ్వాలని. కార్మికులలో వాడలలో మంచినీటి సౌకర్యం రోడ్లు డ్రైనేజీ రోడ్లు తదితర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో సిపిఎం పెద్దపెల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, ఏ ముత్యంరావు, ఏ మహేశ్వరి, ఏం రమాచారి, వేల్పుల కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు మండే శ్రీనివాస్, మేదరి సారయ్య, వడ్లకొండ నాగమణి, నెరవేట్ల నరసన్న, ఉపేందర్, జన్నె కొమరయ్య, మారుపాక భాగ్యలక్ష్మి, పై మద, కొంట్ సాగర్, ఆరేపల్లి రాజమౌళి, రాజేశ్వర చారి, తోట నరహరి రావు, నంది నారాయణ, సీనియర్ నాయకులు పేరు మమ్మద్, శాఖ కార్యదర్శిలు 120 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App