TRINETHRAM NEWS

31 డివిజన్‌లో కుంగి పోయిన రోడ్డు ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు SC శివానంద్, EE రామన్, DE హనుమాన్ నాయక్,

కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఫోర్ లీడర్ కార్పొరేటర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పరపు శ్రీనివాస్, సింహాచలం, డేవిడ్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణం శివాజీ నగర్ (31వ డివిజన్) ప్రధాన కూరగాయల మార్కెట్‌ను ఆనుకొని ఉన్న మురికి కాలువ పక్కనే ఉన్న సిమెంటు రోడ్డు కుంగి పోయింది. గత కొద్దిరోజుల నుంచి మురికి కాలువ ప్రమాదకరంగా మారడంతో పక్కనే ఉన్న రోడ్డు కొద్ది కొద్దిగా పగుళ్లు చూపుతుంది. ఇటీవల ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ వైపునకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మురికి కాలువ పక్కన ఉన్న రోడ్డు కుంగి పోవడంతో భారీ జేసీబీ యంత్రం కాలువలో పడిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్ రోడ్డు కుంగిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా మురికి కాలువ, రోడ్డు నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఇలాగే అయితే పక్కనే ఉన్న నిర్మాణాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉందని, దీనికి వెంటనే శాశ్వత నిర్మాణాలు చేసి పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు అధికారులకు విన్నవించారు. త్వరగా నిర్మాణాలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App