TRINETHRAM NEWS

జీవో నం.118 పేరిట ఓట్లు వేయించుకొని వెన్నుపోటు పొడిచారు : మధు యాష్కీగౌడ్

  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అప్పటి ప్రభుత్వానిది స్వార్థపు బుద్ధి
  • సమస్య పరిష్కరించాలని మధు మధుయాష్కీ గౌడ్ ని కోరిన పలు కాలనీల ప్రతినిధులు

జీవో నం.118 పేరిట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని .. ఓట్ల కోసం కాలనీల ప్రజలకు వెన్నుపోటు పొడిచి.. ఇప్పుడు పట్టించుకోకుండా తిరుగుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు.

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్లోని జీఓ.118 బాధిత కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఈరోజు మధుయాష్కి గౌడ్ ని వనస్థలిపురంలోని పార్టీ కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు జీవో నం.118 ద్వారా తాము ఎలా మోసపోయామో మధుయాష్కి కి వివరించారు. నిషేధ జాబితాలో ఉన్న 22A ను తొలగించకుండా.. తప్పులతడకతో జీవో 118 తీసుకువచ్చారని, కన్వీనియన్స్ డిడ్ తో తమకు ఇళ్ల నిర్మాణానికి, లోన్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తమకు న్యాయం చేయాలని మధు యాష్కీ ని కోరారు.

ఈ సందర్భంగా మాధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ఓట్ల కోసం హడావుడిగా జీవో 118ను తీసుకువచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అప్పటి ప్రభుత్వ పెద్దల దుర్మార్గ , స్వార్థపు బుద్ధి బయటపడిందన్నారు.

ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపకుండా వారితో ఓట్లు వేయించుకొని వెన్నుపోటు పొడిచారన్నారు. కన్వీనియన్స్ డిడ్ కు అసలు విలువ ఉండదని, లోన్లు రావని పేర్కొన్నారు. ఇంటి పర్మిషన్లు రాక, ఇప్పటికే కట్టిన బిల్డింగ్ లకు విలువ లేకుండా చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల ఆస్తులకు విలువ లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలకు ఆ కాలనీలలో తిరిగే అర్హత లేదని విమర్శించారు.

కాగా ఆయా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న జీవో నం.118 సమస్యను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి కొమ్ములేటి శ్రీనివాస్ రెడ్డి గార్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మధుయాష్కి పేర్కొన్నారు. కార్యక్రమంలో వైదేహి నగర్ కాలనీ ప్రతినిధు దామోదర్ రెడ్డి , శివప్రసాద్, సాగర్ కాంప్లెక్స్ ప్రతినిధులు మహేందర్ రెడ్డి, అంజయ్య గౌడ్, శ్రీపురం కాలనీ ప్రతినిధులు కృష్ణారెడ్డి, ముత్యంరావు, శ్రీధర్ రెడ్డి, బి.యన్.రెడ్డి నగర్ నగర్ ప్రతినిధులు ధనరాజ్, గణేష్ రెడ్డి, శ్రీరామ్ నగర్ కాలనీవాసులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App