అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారం

TRINETHRAM NEWS

అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారం
Trinethram News : ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారం వరించింది.ఈ అవార్డును డాక్టర్ దివ్యమూర్తి హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో ఝాన్సీ లక్ష్మీబాయి వారసరాలు మరియు గుర్రం జాషువా వారసురాలు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. తదనంతరం దివ్యమూర్తిని శాలువాతో సత్కరించడం జరిగింది. హోప్స్ స్వచ్ఛంద సేవాసమితి & సింధు ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో దైద వెంకన్న అధ్యక్షతన భారత స్వాతంత్ర సమరయోధుడు, భారత ప్రధమ హోంమంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 149వ జయంతిని పురస్కరించుకొని ఈ పురస్కారాన్ని దివ్యమూర్తికి అందజేయడం జరిగింది. ఈ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 51 అవార్డులు వచ్చాయని 83 చోట్ల సన్మానం జరిగిందని డా. దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, అశోక రాణి, హమీద్ ఖాన్, దైద అనిత, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top