భూ సేకరణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

TRINETHRAM NEWS

భూ సేకరణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

*పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు

రామగిరి తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

రామగిరి, అక్టోబర్ -24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మండలంలోని బుధవారం పేట, రాజాపూర్ గ్రామాలలో సింగరేణి కోసం చేపట్టిన భూసేకరణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం  అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్  రామగిరి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండం మండలం బుధవారం పేట రాజాపూర్ గ్రామాలలో భూ సేకరణ సంబంధించి ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తయిందని, అవార్డుల పై రైతులు అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  మండలం లో మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో వాటిని జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top