TRINETHRAM NEWS

కాషాయి కరణ విద్యా విధానంకై కేంద్రం కుట్రల లను తిప్పి కొట్టాలి

అర్థ శతాబ్ది జిల్లా సభ లో పీ డీ ఎస్ యు మాజీ నాయకులు ఐ,కృష్ణ.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మూడోసారి కేంద్రంలో అధికారం లోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కార్ విద్యా విధానంలో కాషాయికరణని జొప్పించి, పర్యవసానంగా రాజ్యాంగాన్ని రద్దుచేసి,మను ధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలని కుట్రలకు తెర లేపుతున్నారని పూర్వ ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం PDSU నాయకులు ఐ, కృష్ణ స్పష్టం చేశారు.
ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని లోని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో PDSU అర్థ శతాబ్ది జిల్లా సభను నిర్వహించారు, ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ మాట్లాడుతూ నేడు దేశంలో కొనసాగుతున్న విద్య మనిషి నిజ జీవితంలో ఏమాత్రం ఉపయోగపడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఉస్మానియాలో 1972లో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. గత 50 ఏళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ, విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు కోసం, స్కాలర్ షిప్పుల విడుదల కోసం, ఐ.టి.ఐ. కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పి.డి.ఎస్.యూ. ముఖ్య పాత్ర పోషించిందనీ, ఆ పోరాటాల్లో ఎన్నో అక్రమ కేసులను, నిర్బందాలను అనుభవించిందన్నారు. అనేక మంది విద్యార్థి నాయకులు విలువైన ప్రాణాలు సైతం అర్పించారనీ, తన 50ఏళ్ల చరిత్రను గుర్తు చేసారు.
ప్రస్తుత విద్యార్థి సంఘాలు ఆనాటి జాజిరెడ్డి అందించిన స్ఫూర్తితో ఈనాటి పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యు మాజీ నాయకులు కృష్ణస్వామి, సాలగామ మల్లేశ్, శ్రీనివాసరెడ్డి, ఈ నరేష్, బి అశోక్, ప్రస్తుత పి డి ఎస్ యు జిల్లా నాయకులు బడికెల ప్రసన్నకుమార్, వంశీ, సోయల్, సాయి కృష్ణ, రాజ్ కుమార్, రాకేష్, ప్రణీత్, నాయకులు బి ఆనంద్, ఎడ్ల రవికుమార్,ఎం దుర్గయ్య, జనగాం రాజన్న, కాంపెళ్లి మల్లేష్. లతో పాటు ప్రస్తుత ,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App