TRINETHRAM NEWS

Trinethram News : Medchal : ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 130 – సుభాష్ నగర్ డివిజన్ సాయిబాబా నగర్ నర్సింహ బస్తీ కి చెందిన సన కౌసర్ భర్త ఫరీద్, 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రసూన నగర్ కు చెందిన కె. ఆకిర తండ్రి వెంకటేశ్వర రావు ల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సన కౌసర్ (రూ.2,50,000/-), , కె. అకిర (రూ.2,00,000/-) లకు ఎల్ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసానిస్తుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App