TRINETHRAM NEWS

According to the orders of the Supreme Court, the investigation into adulteration of laddoos

Trinethram News : నిర్ణయించారు. ఇప్పటికే సిట్ నాలుగు రోజుల పాటు దర్యాప్తు చేసి కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సిట్ దర్యాప్తు కన్నా కేంద్ర దర్యాప్తు అయితేనే బెటరని.. మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు అడిగింది. గురువారం కేంద్రం తన అభిప్రాయాన్ని చెప్పనుంది.

కేంద్రం ఇచ్చే సమాధానం అధారంగా లడ్డూ కల్తీ కేసు దర్యాప్తును ఎవరు చేస్తారన్నది తేలిపోతుంది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు సిట్ దర్యాప్తు నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమల రావు ఈ విషయాన్ని తిరుమలలోనే ప్రకటించారు. అయితే తిరుమలలో జరిగిన ఇతర అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎవరు దర్యాప్తు చేసినా బయటపడాల్సిన నిజాలు బయటపడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . అందుకే ఈ విషయంలో సిట్ దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తకు సానుకూలంగా ఉంటేనే ముందకెళ్లాలని లేకపోతే.. ఎవరు విచారణకు వస్తే వారికి ఇప్పటి వరకూ సేకరించిన సమాచారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో రాజకీయమే లేదని ప్రభుత్వం తన నిర్ణయంతో చెప్పదల్చుకుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App