Housing for all deserving journalists
జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యుజే (ఐజేయు) కృషి
టీయుడబ్ల్యూజే(ఐజెయు) జిల్లా సహాయ కార్యదర్శి కె . భాస్కర్
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
Trinethram News : షాద్ నగర్ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా టీయుడబ్ల్యూజే(ఐ జెయు) కృషి చేయడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి కే భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం షాద్ నగర్ లో టియుడబ్ల్యూజే రంగారెడ్డి సహాయ కార్యదర్శి భాస్కర్, షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ధన్నారం రమేష్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు ఇంటి స్థలాల దరఖాస్తు పత్రాలను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… జర్నలిస్టుల సంక్షేమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా యూనియన్ అనేక పోరాటాలు చేసిందని అన్నారు.
ప్రస్తుతం ఇండ్ల స్థలాల కోసం చేపడుతున్నటువంటి విలేకరుల వివరాల సేకరణ అనంతరం నియోజకవర్గాల వారీగా లిస్టులను తయారు చేసి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీకి అందజేస్తామని స్పష్టం చేశారు. ఆయన నుంచి ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు రాష్ట్ర యూనియన్ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. సంఘాలకు అతీతంగా నియోజకవర్గంలో పనిచేస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల వివరాలను సేకరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు అసలు ఎవరు కొసరు ఎవరు అనేది తేల్చాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటి స్థలాలతో పాటు ఆరోగ్య భీమా కల్పన తదితర అంశాలపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తుండటం ఎంతో అభినందనీయమని వివరించారు. ఇళ్ల దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి తగిన సమాచారంతో సకాలంలో ఇచ్చేందుకు జర్నలిస్టు మిత్రులందరికీ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఫెరోస్, శివకుమార్, శ్రీశైలం, శ్రీనివాస్, విష్ణు, ఇలియాస్, రాకేష్, మల్లికార్జున్, సాయి, శ్రీకృష్ణ, శ్రీహరి, అల్వాల దర్శన్, నరేందర్, సవాళ్ల రాజు బస్వం అప్ప, శ్రావణ్ గౌడ్, సమీ, సాబీర్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App