TRINETHRAM NEWS

Modi govt introduced autocracy

లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా బలమైన విశాల కార్మిక ఐక్య ఉద్యమం చేపట్టాలి

ఐక్య ఉద్యమాల ద్వారా లేబర్ కోడ్ లను తిప్పి కొట్టగలుగుతాం

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

IFTU ఆధ్వర్యంలో NTPC లేబర్ గేట్ ఎదురుగా కార్మిక సంఘాల పిలుపుమేరకు నిరసన కార్యక్రమం జరిగింది. నిరసన కార్యక్రమంలో లేబర్ కోడ్ లను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటులో కార్మిక చట్టాలను సవరించింది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కార్మిక చట్టాలను రూపొందించి ఆమోదించింది.

ఆదానీ అంబానీ లాంటి కార్పోరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించింది. ఈనాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మోడీ చర్యలను నిరసిస్తూ బ్లాక్ డే ను విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి బహిరంగంగా క్షమాపణ చెప్పిగా కార్మిక చట్టాలను సవరించే చర్యలను, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టాలంటే దేశంలో బలమైన విశాల ఐక్య ఉద్యమం జరగాలి.

ఆ దిశగా కార్మిక వర్గం ఉద్యమాలలో కలిసి రావాలని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైతన్యంతో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. *ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, IFTU జిల్లా నాయకులు ఆడెపు శంకర్, మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, పెండ్యాల రమేష్, కలవల రాయమల్లు, కోడిపుంజుల లక్ష్మి, గూడూరి వైకుంఠం, బత్తుల సదానందం, బత్తుల రాజన్న, ఎస్.డోమన్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi govt introduced autocracy