
Immersion ceremony of Lord Ganesh in Bhaurampet
వేడుకలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు… భౌరంపేట్ గ్రామ పెద్దలు, యువకులు…
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని కాముని కంత లో గత 75 సంవత్సరాలుగా నెలకొల్పుతున్న శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన వేడుకలు రైసింగ్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 11 రోజులు విశిష్ట పూజలు అందుకున్న లడ్డూను వేలం నిర్వహించగా సీనియర్ నాయకులు శ్రీ నర్సారెడ్డి విరారెడ్డి 6 లక్షల 5 వెయిల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. అనంతరం భక్తులందరూ ఆ గణనాథునికి విశేష పూజలు జరిపి అఖండ కాకడ హారతిని అందించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు మరియు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
