Victims of Singareni aliases who sought support from NCP party
రామగుండం నియోజకవర్గంలో మారు పేర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న
సింగరేణి కార్మిక వారసులు, చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ కు, జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర కు ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల వారసులు మేకల శ్రీధర్ యాదవ్ కు, గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్రలతో వారు పడుతున్న భాదలను తెలియజేస్తూ” మారు పేర్లతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఆర్.ఎల్.సీ సమావేశంలో 14 కార్మిక సంఘాలు మారు పేర్ల సమస్యలను పరిష్కరించడానికి సంతకాలు కూడా చేయడం జరిగిందని, కానీ తమ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే తరహాలో ఉన్నదని, మారు పేర్ల సమస్యలను పరిష్కారం చేయాలని, ఆర్జీ 1 జీయం ఆఫీస్ వద్ద 20వ తారీఖు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ తరఫున మద్దతు తెలిపి, నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరుతూ, అనంతరం వినతిపత్రం అందజేసినారు.
ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ” సింగరేణీ కార్మిక మారు పేరు సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఎన్సీపీ పార్టీ మద్దతు తెలుపుతుందని, చేసే పోరాటాలలో, కార్యక్రమాలలో పాల్గొంటామని, మారు పేరు సమస్యతో సుమారు 20000 మందికి పైగా సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన భాద్యత సీయం రేవంత్ రెడ్డి పైన ఉన్నదని, సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆపకూడదని” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, మొలుగూరి మహేష్, సింగరేణీ కార్మిక మారు పేర్ల భాదితులు లక్క శ్రావణ్ , మాచర్ల నవీన్ కుమార్ , కాసు బీరయ్య , కే రాజన్న , పొన్నం వెంకటేష్ , చాట్ల సదానందం, శనగరపు శ్రీనివాస్,వేగలపు సునీల్ కుమార్, బుగ్గా అరుణ్ కుమార్, తిరుమల శ్రీనివాస్ బొమ్మక రాజయ్య, పి.ఐలయ్య, సత్తన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.