జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 16 at 10.57.14

TRINETHRAM NEWS

Case against choreographer Johnny Master on rape charges

తనను లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు

జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు

కేసు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ

Trinethram News : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణల కేసు చేశారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

సదరు మహిళ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page