WhatsApp Image 2024 09 15 at 15.47.09
New Telangana PCC presidents
మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర నూతన పిసిసి అధ్యక్షులుగా నేడు గాంధీభవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ మరియు రామగుండం కాంగ్రెస్ మహిళ లీగల్ సెల్ చైర్పర్సన్ గడమల్ల వరలక్ష్మి.
ఈ సందర్భంగావరలక్ష్మి మాట్లాడుతూ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గత 38 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ విద్యార్థి దశలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 1986లో నిజామాబాదు జిల్లా అధ్యక్షుడిగా మరియు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేసినారు. 2013 -14 లో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పని చేసినారు.
ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా 2018లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మ్యానిఫెస్టో కన్వీనర్ గా, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2023లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యునిగా, జనవరి 2024లో శాసనమండలి సభ్యునిగా సెప్టెంబర్ 6 2024 నాడు నూతన టిపిసిసి అధ్యక్షులుగా నియమితులై సెప్టెంబర్ 15 నాడు గాంధీభవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “PCC Presidents : తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షులు”
Comments are closed.