TRINETHRAM NEWS

The government should support the poor family of the fire accident in Khani Vithal Nagar

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ప్రాంతంలోని విఠల్ నగర్ కు చెందిన నిరుపేద కుటుంబం రామగుండం నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో ఆటో ట్రాలీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న కోడేపాక మహేందర్ 13వ డివిజన్ లో కుటుంబంతో నివసిస్తున్న తరుణంలో వారి ఇంట్లో దురదృష్టం కొద్ది అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగి ఇంట్లో అస్థి నష్టం జరిగిందని, అలాగే మహిళ స్వశక్తి పొదుపు సంఘాల సభ్యుల డబ్బులు, మరియు ఇంట్లో దాచుకున్న డబ్బులు అగ్నికి ఆహుతి అయ్యాయని, మరియు బట్టలు పరుపులు, మరియు వంట సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోవడం జరగిందని అవేదన వ్యక్తం చేశారు.
అనంతరం సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ అగ్ని ప్రమాదం మహేందర్ ఇల్లును చూసి కుటుంబ సభ్యులని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించి స్థానిక రామగుండం తహసీల్దార్ కుమార స్వామి దృష్టికి తీసుకెళ్లడంతో పంచనామా చేసి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అన్నారు.
అదే విధంగా రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ సమాచారం ఇవ్వగా తప్పకుండా మున్సిపల్ కార్పోరేషన్ నుండి మహేందర్ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం అని తెలిపారు అన్నారు.
అదే విధంగా స్థానిక రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ కూడా వారికి అండగా నిలిచి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
కావున నష్టం జరిగిన కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని మానవతా దృక్పథంతో పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలని వ్యాపారులు మేధావులు సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు.
వారి కుటుంబాన్ని సందర్శించిన వారిలో ఏఐయుటిసి నాయకులు ఏం.ఏ. గౌస్, కాసరపు రాకేష్, మున్సిపల్ సూపర్వైజర్ సారయ్య, మరియు సిబ్బంది రొడ్డ రాజేందర్ తో పాటు మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The government should support the poor family of the fire accident in Khani Vithal Nagar