Things to observe during immersion
చెప్పిన వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి
Trinethram News : గణేష్ మండపనిర్వాకులు, భక్తులు, ప్రజలు నవరాత్రులు గణేశునికి సేవలు చేసి ఆ దేవుడు ఆశీర్వాదములు పొంది నిమజ్జనం రోజు ఈ క్రింది సూచనలు పాటించలగరు నిమజ్జనం రోజు నిర్వాహకులు అందరూ కూడా మండపం దగ్గర ఉండాలి. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన వాహనానికి సంబంధించి వాహనం యొక్క కండిషన్ మరియు వాహనం డాక్యుమెంట్ సరిగా ఉన్నది/ లేనిది చెక్ చేసుకోవాలి.
వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ పూర్తి వివరాలు తెలిసి ఉండాలి. అట్టి వాహన డ్రైవర్ ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి ఉండరాదు. అట్టి వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉండాలి.వాహనంలో డీజిల్ సరిగా ఉన్నది/లేనిది చెక్ చేసుకోవాలి. అదేవిధంగా వాహనం యొక్క కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి.
మండపం నుంచి విగ్రహాన్ని వెహికల్ లో పెడుతున్నప్పుడు చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి. అదేవిధంగా విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు పిల్లలను వెహికల్ పైన కూర్చోబెట్టినప్పుడు వారి తల్లిదండ్రులు దగ్గరలోనే ఉండాలి మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన రాదు. దేవుడి పాటలు మాత్రమే వేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజె(DJ) సౌండ్ సిస్టం ఉపయోగించరాదు. ఒకవేళ డిజె సౌండ్ సిస్టం ఉపయోగించినట్లయితే వెంటనే DJ ను సీజ్ చేసి వారిపైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాహనాలలో గానేఆహుని విగ్రహాల మధ్యాన్నం 2గంటల వరకు వాహనం లోకి ఎక్కించి ఉరేగిపుగా నిమజ్జనానికి తీసుకు వెళ్ళాలి.
నిమజ్జనం ప్రదేశంలో ఫోటోలు సెల్ఫీల కోసం భూమి కూడటం విగ్రహం నిమజ్జనం చేస్తున్నప్పుడు ఫోటోలు తీస్తూ సెల్ఫీలు తీస్తూ ఉండరాదు. నిమజ్జనం ప్రదేశంలో పోలీసు వారి సూచనలు పాటిస్తూ విగ్రహాన్ని నిమర్జనం చేయాలి. చిన్నపిల్లలను నిమర్జనం ప్రదేశానికి రానీయకూడదు పైన పోలీసు వారు చూపించిన సూచనలు పాటిస్తూ ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App