TRINETHRAM NEWS

Goliwada Prasanna Kumar demands to keep the word given to the workers

స్థానిక‌ గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ‌ సమావేశంలో మొదటగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిమిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్ ఇచ్చిన‌ హామీలను వీడియో ద్వారా ప్రదర్శించారు. అనంతరం మాట్లాడుతూ ” సింగరేణి కాలరీస్ కంపెనీ పుట్టినప్పటి నుండి కార్మికులు వారి చెమటను, రక్తాన్ని‌ చిందించి లక్షల కోట్ల రూపాయలు కంపెనీకి, ప్రభుత్వానికి ఆదాయాన్ని ఆర్జించి పెట్టారని, లక్ష మందికి పైగా కార్మికులు నేడు రిటైర్మెంట్ తరువాత వచ్చే పెన్షన్ లతో దీనావస్తలో జీవనం‌ సాగిస్తున్నారని,‌ ఇప్పటికి కేవలం‌ 300 రూపాయలు, 1000 రూపాయల పెన్షన్ అందుకునే కార్మికులు, వారిపై‌ ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయని, ప్రస్తుతం 70,75 సంవత్సరాల వయస్సులో కుటుంబ పోషన కోసం కూలీ పనులకు, ఏదైనా దుకాణాలలో‌ పనివాళ్లుగా సింగరేణీ రిటైర్డ్ కార్మికులు పని చేస్తున్నారని అన్నారు.

పెరిగిన‌ ధరలకు అనుగుణంగా రిటైర్ అయిన ప్రతీ సింగరేణి కార్మికునికి వృద్ద వయసులో ప్రదంగా జీవించేలా వారందరికి కనీస పెన్షన్ 18,000 రూపాయలు చేయాలని, అలాగే 20,000 మందికి పైగా సింగరేణి కార్మికులు మారుపేర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి‌ కుటుంబ సభ్యులు సింగరేణి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు పొందడానికి, పెన్షన్లు తీసుకోడానికి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సింగరేణీ కార్మికుల పిల్లలు వారసత్వ ఉద్యోగాల‌ కోసం‌ తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మానవతా దృక్పధంతో సింగరేణీ కార్మికుల మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని అన్నారు.

అంతేకాకుండా సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచి కోల్ ఇండియాలో ఇస్తున్న‌ విధంగా హైపవర్ వేతనాలు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి ఇరవై లక్షల మంది సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇప్పుడు వస్తున్న వేతనాలతో నెల గడవడం చాలా కష్టతరం అవుతున్నదని, నెలకు వారు అప్పులు చేయకుండా జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, సంఘటిత అసంఘటిత కార్మికుల వేతనాలపై ఒక‌ కమిటీని వేసి, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, వేతనాలు పెంచడానికి కృషి చేయాలని అన్నారు.

సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కి జీవనాడి అని, తెలంగాణ రాష్ట్రం లో 16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలలో విస్తరించి ఉన్నదని, అన్ని నియోజనవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని సింగరేణి కార్మికుల సమస్యలను, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను, సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలను రాష్ట్ర సీయం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషిచేయాలని బి.జనక్ ప్రసాద్ కి గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర పత్రికా ముఖంగా బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది..
ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, విద్యార్థి నాయకులు నాగుల‌ శివకుమార్, యువజన‌ నాయకులు మొలుగూరి మహేష్, కుమ్మరి నాగార్జున, అక్కపెల్లి చంద్రశేఖర్ ఆజాద్, పొడిషెట్టి మణిదీప్, మహిళా నాయకురాళ్లు గోలివాడ సరిత, గుంటి విజయలక్ష్మి, బద్రి లక్ష్మి, మామిడిపల్లి రాజేశ్వరి, ఇరుకుల్ల లక్ష్మీ, కాంపెల్లి శంకరమ్మ, దానవేన రమ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App