Flood rising in Munner.. Deputy CM Bhatti left for Khammam
Trinethram News : ఖమ్మం: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరువాగు పొంగే అవకాశం ఉండటంతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం బయలుదేరారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ఉద్ధృతిపై జిల్లా ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
మరోవైపు మున్నేరువాగు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలకు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉద్ధృతి పెరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరదల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని, సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.