Four labor codes and three criminal laws should be repealed
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
టీ శ్రీనివాస్ IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి లో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్, మూడు నేర చట్టాలు కార్మిక వర్గానికి ప్రమాదకరంగా ఉన్నాయని ఆ చట్టాలను రద్దు చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ అలాగే మూడు క్రిమినల్ చట్టాలను అన్నారు.
దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించని దౌర్భాగ్య పరిస్థితి నేడు దేశంలో ఉందన్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటి కరణ చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించి, ఔట్ సోర్సింగ్ కార్మికుల కు కార్మిక చట్టాలను అమలు చేయాకుండా అడ్డుకోవడం కొరకు మాత్రమే నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
భారత శానికి కోట్లాది రూపాయల లాభాలను తీసుకువచ్చే రైల్వే, బ్యాంకింగ్, ఎల్ ఐ సి, కోల్ ఇండియా, ఓడరేవులు, విమానయానం తో పాటు మినీ రత్న, మహారత్న ,నవరత్న, బిరుదులు పొందిన ప్రభుత్వ రంగ సంస్థల ను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం కోసం మోడీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు.
ఈ ప్రయత్నాలను భారతదేశ కార్మిక వర్గం తిప్పి కొట్టాలి. ఢిల్లీలో రైతాంగం తరహా పోరాటాలు చెయ్యాలన్నారు
దేశంలో లక్షలాది మంది అసంఘటిత రంగం కార్మికులు అతి తక్కువ వేతనాల తో పనులు చేస్తున్నారు.
ఈ కార్మికుల వేతనాలు పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని అన్నారు.
ఈ సమస్యల పరిష్కారం కై ఢిల్లీ రైతంగా తరహా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
కనుక భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) రెండు రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా సెప్టెంబర్ *8న. ఆదిత్య హోటల్ మార్కండేయ కాలనీ. గోదావరి ఖనిలో ప్రాంతీయ సదస్సు జరగబోతుంది.
ఈ సదస్సుకు ఐ ఎఫ్ టీ యు జాతీయ ఉపధ్యక్షులు బి ప్రదీఫ్,జాతీయ ప్రధాన కార్యదర్శి టీ శ్రీనివాస్,అలాగే మరో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఎం శ్రీనివాస్. పాల్గొంటారు.
ఈ ప్రాంతీయ సదస్సులో కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్.4 జిల్లా లలో ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ జాయింట్ సమావేశం లో రెండు భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి, బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు ఎం దుర్గయ్య, వి కొమరయ్య, ఎడ్ల రవికుమార్, తిప్పని రాంకీ ,పి వెంకటస్వామి, కే ఎల్లయ్య ,ఎం కాంతయ్య, ఎన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App