Indian Prime Minister Narendra Modi held bilateral talks with Ukrainian President Zelensky
Trinethram News : ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మోదీ ఉక్రెయిన్ పర్యటన ఓ మైలురాయిగా నిలుస్తుందన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధ, వ్యవసాయం, విద్య రంగాల్లో సహకారంపై మోదీ, జెలెన్‌స్కీ చర్చించినట్లు పేర్కొన్నారు జైశంకర్.
ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి కూడా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు. శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని మోదీ పునరుద్ఘాటించనట్లు పేర్కొన్నారు.
రెండు రోజుల పోలండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ, 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App