TRINETHRAM NEWS

District Collector Koya Harsha should give suggestions on RVR draft bill

*నిపుణులు అందించిన ప్రతి సలహాను సిసిఎల్ఏ కు నివేదిస్తాం

*నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, ఆగస్టు -22: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు.

గురువారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు జే.అరుణ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, డిసిపి ఎం.చేతనతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు.

నూతన ఆర్వోఆర్ చట్టం 2024 ముసాయిదా బిల్లు లో పేర్కొన్న అంశాలు, ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశం అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం నూతన ఆర్వోఆర్ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన ఆర్వోఆర్ 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందని కలెక్టర్ తెలిపారు.

నూతన చట్టం రూపకల్పనలో విస్తృతంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లు పై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ( రిటైర్డ్& సర్వీస్) తమ సూచనలను అందజేయాలని కలెక్టర్ కోరారు.

నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా 2,3 రోజులలో కలెక్టరేట్ కార్యాలయానికి అందిస్తే, వాటిని ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి తుది చట్ట రూపకల్పన కోసం సీసీఎల్ఏ కు అందజేస్తామని కలెక్టర్ అన్నారు.

చర్చ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు సుదర్శన్, శంకరయ్య, న్యాయవాదులు శశి భూషణ్ సాయిల్ రెడ్డి , టీఎన్జీవో అధ్యక్షులు బొంకూరి శంకర్ తమ సూచనలు సలహాలు తెలిపారు. గ్రామంలోని ఆబాది భూముల రికార్డులు అప్డేట్ చేయాలని, సాధా బైనమా భూముల రిజిస్ట్రేషన్ రుసుం వసూలు చేయాలని, పోజిషన్ కాలం ఉండాలని, అప్పిలేట్ అథారిటీ ఆర్డిఓ స్థాయిలో ఉండాలని అన్నారు.

చర్చ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి తహసిల్దార్ రాజ్ కుమార్ నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై పలు సూచనలు చేశారు. 1971 సంవత్సరంలో ఆర్వోఆర్ చట్టం తెస్తే 1989 లో రూల్స్ అందించారని, 2020 ఆర్వోఆర్ చట్టానికి ఇప్పటివరకు రూల్స్ తయారు చేయలేదని, నూతన ఆర్వోఆర్ చట్టం 2024 అమలు చేసిన నెలరోజుల లోపల రూల్స్ రూపొందించాలని తెలిపారు.

నూతన ఆర్వోఆర్ చట్టం అమలు కోసం ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, భూ సమస్యల అప్పిలేట్ అథారిటీ జిల్లా స్థాయిలోనే ఉండే విధంగా చూడాలని తెలిపారు.

ఈ చర్చ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, వి.హనుమా నాయక్, తహసిల్దార్ లు, ని

District Collector Koya Harsha should give suggestions on RVR draft bill