WhatsApp Image 2024 08 15 at 16.43.41
Blood donation camp in Khani
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో గురువారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అడ్డగుంటపల్లి లోని మెడికల్ అసోసియేషన్ భవన్లో నిర్వహించిన రక్తదానం శిబిరం లో మెడికల్ అసోసియేషన్ సభ్యులు, పలు స్వచ్ఛంద సేవకులు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ వి ఎల్లప్ప, సీనియర్ సభ్యులు ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, కజాంపురం రాజేందర్, తిలక్ చక్రవర్తి, బంక రామస్వామి, డాక్టర్ కె వెంకటేశ్వర్లు, కోలేటి శ్రీనివాస్, ఏ సత్యనారాయణ, గోదావరిఖని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
