Women in NCP : గౌతమినగర్ ఎన్సీపీ పార్టీ లో మహిళల చేరిక

TRINETHRAM NEWS

Gautaminagar Inclusion of women in NCP party

ప్రగతి నగర్ కు చెందిన మహిళలు ఎన్సీపీ పార్టీలో చేరడం జరిగింది.

ఈ చేరికల కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు పార్టీ కండువాలు కప్పి ఎన్సీపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర మాట్లాడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆదేశాలతో రామగుండం కార్పోరేషన్ 39వ డివిజన్ , ప్రగతి నగర్ కు చెందిన మహిళలను పార్టీలో చేర్చుకోవడం జరిగిందని, మేము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ప్రజా సమస్యలపై పోరాడతామని మాపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీస్తామని” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు, మహిళా నాయకురాలు పొన్నం రజిత యాదవ్, అర్కుటి పద్మ, మేకల రాజేశ్వరి, నూనె కనుక లక్ష్మీ, గుంటి జయమ్మ, తుంగ పోచమ్మ, ఇరుకుల లక్ష్మీ, దేశబత్తుల రజిత, ఇర్ఫానా తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gautaminagar Inclusion of women in NCP party

You cannot copy content of this page

Scroll to Top