TRINETHRAM NEWS

Participated in cleanliness – green program

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు ఇంచార్జి కలెక్టర్ సుదీర్ తో కలిసి స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ..

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు, 23వ వార్డు, 24వ వార్డులలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ సుదీర్ లతో కలిసి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్.. పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పార్కుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. అనంతరం గంగారంలో గల డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన కలెక్టర్.. వీలైనంత తొందరగా డంపింగ్ యార్డ్ పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్ కౌన్సిలర్లు రామస్వామి, కిరణ్ పటేల్, శ్రీదేవి సదానంద్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, నాయకులు సురేష్ గౌడ్, మేక చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Participated in cleanliness - green program