జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 05 at 13.33.32

TRINETHRAM NEWS

A fellow employee who raped the woman in the room

Trinethram News : సంతోష్ చైతన్య అనే వ్యక్తి బేగంపేటలోని తన ఫ్లాట్లో తోటి మహిళా ఉద్యోగినిని బంధించి అత్యాచారం చేశాడు.

ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాకి చెందిన ఓ మహిళ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది.. అయితే సదరు మహిళకు ఉండటానికి ఫ్లాట్ లేకపోవడంతో తోటి ఉద్యోగి అయిన సంతోష్ తనకు ఇల్లు వెతకడానికి సాయం చేస్తానని, అంతలోపు తనతో వాళ్ల ఇంట్లో ఉండాలని తనతో పాటు తల్లి, చెల్లి కూడా ఉంటారని నమ్మించి ఇంటికి తీసుకు వెళ్లాడు.

ఇంటికి వెళ్లిన అనంతరం ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన మహిళ అతన్ని ప్రశ్నించగా అతడు ఆమెను ఒక రూమ్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

మహిళ గోల చేయగా, తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అయితే కొన్ని రోజులకు మహిళను బైటకి వదిలాడు, బాధిత మహిళ ఎన్ని సార్లు ఫోన్ చేసినా సంతోష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పోలీసులని ఆశ్రయించి అతనిపై కేసు పెట్టింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A fellow employee who raped the woman in the room

You cannot copy content of this page