WhatsApp Image 2024 07 31 at 14.09.48
Additional Collector G.V.Shyam Prasad Lal took steps to resolve the pending land issues
ముత్తారం , జూలై-31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మండలంలో పెండింగ్ ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ముత్తారం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో ఉన్న పెండింగ్ ధరణి సమస్యలు ,భూసేకరణ, వివిధ సర్టిఫికెట్ల జారి మొదలగు అంశాల పై రివ్యూ నిర్వహించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు.
మీసేవ కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు జారీ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.
అనంతరం తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం కింద అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సమావేశంలో ముత్తారం మండల తహసిల్దార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
