పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ?
న్యూ ఢిల్లీ :డిసెంబర్ 26
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావొచ్చేనే అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈనెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రానున్నారు.
తెలంగాణలో బీజేపీ 10 సీట్లు టార్గెట్ పెట్టుకోగా.. అందుకు అనుగుణంగా అమిత్ షా నేతలకు దిశా నిర్దేశం చేయను న్నారు.ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది.
తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవాళ గవర్నర్ ఢిల్లీ పర్య టనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తన ఎంపీ అభ్యర్థిత్వంపై ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలు స్తోంది.తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి పోటీకి ఆమె రెడీ అయినట్లు తెలుస్తోంది.
తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు.
మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు.
2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.అయితే రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయా ల్లోకి రావాలని ఆమె భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో లోక్ సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
జనవరిలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరిని గవర్నర్‌గా నియమిస్తారనేది చర్చనీయాంశమైంది.
బీజేపీకి చెందిన వ్యక్తిని నియమిస్తారా? లేక పార్టీలకు సంబంధం లేని రిటైర్డ్ అధికారులు, రిటైర్డ్ జడ్జిలను నియమిస్తారా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది