WhatsApp Image 2024 07 25 at 1.19.48 PM
An RTC bus rammed into a cowshed
హైదరాబాద్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది ఓ ఆర్టీసీ బస్సు..
ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రయాణికులకు గాయాలు అయినట్లు తెలుస్తుంది,ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ టి, నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ,గ్రామం లోకి రాగానే అదుపుతప్పి బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి ఆనిల్ అనే రైతు పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది.
పశువుల పాకలో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. ఎద్దు కు తీవ్ర గాయాలు కాగా.. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయినట్లు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
