Telangana State Cabs Protect Trade Union (TRCPTU) under the Peddapally District Committee and State Presidents of the Union
కౌడ సతీష్ అధ్యక్షతన కరీంనగర్ బస్ స్టాండ్ సెంటర్ నుండి జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయ వరకు మహా పాదయాత్ర కొనసాగింది.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ సందర్బంగా TRCPTU రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కౌడ సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన తెలంగాణ లో డ్రైవర్ లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని వెంటనే అమలు పరిచి సంక్షేమ బోర్డు మంజూరు చేయాలనీ, డ్రైవర్లకు తెల్లరేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన డ్రైవర్లకు కార్పొరేషన్ ల ద్వారా వాహనాలు అందించాలని, మ వి యాక్ట్ -2019 రద్దు చేయాలని, హిట్ & రన్ చట్టాన్ని తెలంగాణ లో అమలు చేయరాదని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆఫ్జల్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మల్లేశం, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు వీరేశం, ప్రధాన కార్యదర్శి బి. రవి, ట్రెజరర్ పంజలా శ్రీనివాస్, కార్యదర్శి చాట్ల దిలీప్, న్టీపీసీ ప్రెసిడెంట్ బత్తిని రమేష్, సభ్యులు భాస్కర్ కే విజయ్, ఎం కుమార్, కిరణ్, కే జనార్దన్, జి భాస్కర్, మహేందర్,క్రాంతి,తిరుపతి, సంతోష్ రాము,నాగరాజు, నేతాజీ, బాపన్న, సురేష్, రామరాజు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App