WhatsApp Image 2024 07 13 at 14.47.10
Youth committed suicide in Bhupalapally district?
భూపాలపల్లి జిల్లా:జులై 13 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భూపాలపల్లి జిల్లా లో అనారోగ్యం సమస్యతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది..
కొయ్యుర్ ఎస్ఐ తెలిసిన పూర్తి వివరాల ప్రకారం తాడిచెర్ల గ్రామానికి చెందిన మేనం నరేశ్ (25) కాపురం గ్రామంలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ, ఓసిపి బ్లాక్-1లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
నరేశ్ ఆరు నెలలుగా పైల్స్ సమస్యతో బాధపడేవాడని కొద్ది రోజుల క్రితం చికిత్స చేయించుకున్న కూడా తగ్గకపోవడంతో దీంతో బాధ భరించలేక జీవితంపై విరక్తి చెందిన అతడు శుక్రవారం సాయంత్రం ఇంటిముందు ఉన్న రేకుల షెడ్డు కు తాడుతో ఉరివే సుకొని ఆత్మహత్య చేసు కున్నట్లుగా తెలిపారు.
మృతుడి సోదరుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యురు ఎస్ఐ వెల్లడించారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
