DPRs with Rs.3 thousand
రహదారుల అభివృద్ధికి రూ.3 వేల కోట్లతో డీపీఆర్లు
Trinethram News : కృష్ణా జిల్లా : దిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయిస్తా అధికారులకు స్పష్టం చేసిన ఎంపీ బాలశౌరి
కృష్ణా జిల్లాలో కీలక జాతీయ రహదారుల అభివృద్ధికి
రూ.3 వేల కోట్లతో డీపీఆర్లు సిద్ధం కానున్నాయి. వీటిపై ఎంపీ వల్లభ నేని బాలశౌరి ప్రత్యేక దృష్టి సారిం చారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ ట్రాన్స్పోర్టు హైవేస్ అధికారులతో భేటీ అయి వారికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు నుంచి పెడన బైపాస్ రహదారికి, పోర్టు నుంచి చిలకలపూడి, చిలకలపూడి నుంచి 216 జాతీయ రహదారికి అనుసందానిస్తూ రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు 11 కి. మీ రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు.
అలాగే గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్, గుడివాడ నుంచి నూజివీడు, గుడివాడ నుంచి పెడన జాతీయ రహదారులను గతంలో రెండు వరుసల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయిం చడం జరిగిందని, నాలుగు లైన్లుగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాల న్నారు. ఇందుకు ఎన్ని నిధులు అవ సరమవుతాయని ఎంపీ అడగగా.. 120 కి.మీ. మేర రోడ్లు నిర్మించాల్సి ఉందని 3వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతా యని అధికారులు తెలిపారు.
దీనిపై స్పందించిన ఎంపీ బాల శౌరి.. ఈ రోడ్లు అన్నింటికీ డీపీఆర్లు తయారు చేయాలని, త్వరలో ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలిసి నిధులు విడుదలకు కృషి చేస్తానని అన్నారు. కృష్ణా జిల్లాలో పలు జాతీయ రహదారులతో పాటు మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులకు అనుసంధానించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని వల్లభనేని బాలశౌరి అధికారులకు సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App