TRINETHRAM NEWS

Finally the Congress government came down

 మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 

బీజేపీ పార్టీ, ప్రజల తరుఫున ప్రశ్నించినందుకే మహాదేవపూర్ మండల కేంద్రంలో “ఎర్ర చెరువు” పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఎర్రచెరువు పనులు పరిశీలించిన బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి 

మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘చిన్న కాళేశ్వరం ‘ ప్రాజెక్ట్ 2009లో మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాలేదు.

మేము గతంలో నియోజకవర్గ ప్రజల తరుఫున గత ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎన్నో మార్లు పనులు చేయాలనీ కోరడం జరిగింది.

ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఇప్పుడు మొదలు పెట్టిన పనులకు మధ్యలో ఆపకుండా పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలనీ ప్రజల పక్షాన, బీజేపీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.

చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందా 13 చెరువులను మరమ్మత్తు చేస్తూ, ఈ చెరువులను అన్నింటిని మినీ ట్యాంక్ బండ్ లుగా, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లేనటువంటి విలాసాగర్ చెరువు, చింతకాని చెరువు, గూడెపు చెరువులను కూడా మరమ్మత్తు చేయాలనీ కోరుతున్నాం.

మహాదేవపూర్ లో ఉన్నటువంటి ఎర్రచెరువు ను కట్ట పోసి “0.4” టీఎంసీ చేయకుండా, దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేసి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఫిట్ చేసి, వాకింగ్ ట్రాక్, పార్క్ ఏర్పాటు చేసి మండల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.

మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో హాసన్ పర్తి, భద్రకాళి చెరువు, ధర్మసాగర్ చెరువులకు మీరు వెళ్లి పరిశీంచి మన మంథని ప్రాంతంలో కూడా చెరువులను మరమ్మత్తు చేయాలనీ కోరుతున్నాం.

మీరు ఈ ప్రాంతానికి ఎంత చేసిన తక్కువే, ఇంకా చేయాల్సింది ఎక్కువ ఉంది. మీరు చేసింది తక్కువే ఈ ప్రాంతానికి.

ఇప్పటికైనా మంత్రిగా ఉన్న మీరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజల పక్షాన కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడప లక్ష్మి నారాయణ, ఐలయ్య యాదవ్, మనోజ్, రాజేందర్, సంపత్ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Finally the Congress government came down