TRINETHRAM NEWS

Imprisonment for people caught in drunk and driving

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దిన్ ఆధ్వర్యంలో తాళ్ళగురిజాల ఎస్ఐ నరేష్ గత కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ లో పట్టుబడిన 05 మందుబాబులకు ఈ రోజు తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కౌన్సెలింగ్ నిర్వహించి మద్యం సేవించి వాహనం నడిపితే జరిగే అనర్థాల గురించి వివరించారు.

డ్రంక్&డ్రైవ్ లో దొరికిన వారికి జరిమానాలు పడటమే కాకుండా ,జైలు శిక్ష కూడ పడుతుందని వారి లైసెన్సుల రద్దు కొరకు సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.

కౌన్సెలింగ్ అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాహనదారులను గౌరవ JFCM మేజిస్ట్రేట్ బెల్లంపల్లి ముందు హాజరుపరుచగా 05 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Imprisonment for people caught in drunk and driving