WhatsApp Image 2024 06 05 at 11.19.04
Chandrababu Naidu’s oath on 9th of this month: Narendra Modi to attend?
Trinethram News : అమరావతి: ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తిరుగు లేని విజయం సాధించడం తో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చ ప్రారంభ మైంది. ఫలితాలకు ముందు ఈ నెల 9న జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం చేయగా..
ఇప్పుడు అదే రోజున చంద్ర బాబు ప్రమాణస్వీకారం ఉంటుందని టీడీపీ శ్రేణులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకా రం ఉంటుందని టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం 20 సీట్లు కూడా దక్కకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలను నిజం చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది.
వైసీపీ,కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగు తుందని అంతా అనుకు న్నా… ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. వైసీపీ ప్రచా రంలో ఎంత ధీటుగా పోటీనిచ్చిందో ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో చతికిల పడింది.
ఎన్డీఏ కూటమి ఘన విజ యంతో చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయ నున్నారు. అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతు న్నాయి.
ఇప్పటికే చంద్రబాబు ప్రమా ణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ప్రారంభ మైనట్లు తెలుస్తోంది. ఈ నెల 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయగా…ఇప్పుడు అదే తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారణానికి ముహూర్తం ఫిక్స్ అవడం చర్చనీయాంశంగా మారింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
