WhatsApp Image 2024 05 27 at 18.26.02
Young Telangana woman dies in US road accident
Trinethram News : హైదరాబాద్:మే :27
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా కు చెందిన యువతి ఈరోజు మృతిచెందింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యాదాద్రి జిల్లా యాదగిరి పల్లికి చెందిన యువతి ఫ్లోరిడా నగరంలో మృతి చెందింది.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కారు అతివేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో యువతి సౌమ్య అక్కడికక్కడే మృతిచెందగా…
సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు తెలియజేశారు. యువతి మృతిచెందిన వార్త తెలియడంతో యాద గిరిపల్లిలో విషాధఛాయలు అలముకున్నాయి.
అత్యున్నత స్థాయికి ఎదు గుతుం దనుకున్న కుమార్తె హఠాత్తుగా మృతిచెందడం తో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
