TRINETHRAM NEWS
Good news for the beneficiaries of those schemes in AP.. EC green signal for release of DBT funds

Trinethram News : డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మే 15, ఒక్కరోజే ఆసరాకు రూ.1480, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్‎మెంట్ రూ.502 కోట్ల నిధులు విడుదల అయ్యాయి.

మిగిలిన పథకలకు నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది ప్రభుత్వం. ఏపీలో డీబీటీ ద్వారా నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జరీ చేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఫథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయగా మిగిలిన వాటికి కూడా రెండు మూడు రోజుల్లో నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‎కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా అడ్డుకున్నారు.

అయితే దీనిపై లబ్ధిదారుల్లో కొందరు విద్యార్థులు, మహిళలు ఏపీ కోర్టును ఆశ్రయించారు. తమకు ప్రత ఏటా క్యాలెండర్ ప్రకారం లభించే నిధులను విడుదల చేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది.

లబ్ధిదారులకు ప్రతి ఏటా ఇచ్చినట్లే నిధుల విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే దీనిపై ఈసీ మే 10 లోపు నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. అయితే దీనిపై ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చకుండా కాలక్షేపం చేసింది.

దీంతో ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు అనుమతి ఇచ్చినా నిధుల విడుదల విషయంలో ఎందుకు జాప్యం చేశారని, ఏపీ హైకోర్టు తీర్పును ఎందుకు పట్టించుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నిధుల విడుదల జరగలేదు. మే 13న పోలింగ్ ముగిసిన తరువాత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యాదీవెన, సంపూర్ణ ఫీజు రీఎంబర్స్‎మెంట్ కింద రూ. 1982 కోట్ల రూపాయలు నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది.

మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా రెండు, మూడు రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. దీంతో విద్యార్థులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for the beneficiaries of those schemes in AP.. EC green signal for release of DBT funds..