ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : AP Election 2024 Voting Percentage Till 5 pm: ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం నమోదైంది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు అవకాశం కల్పిస్తున్నారు.

AP Election 2024 Voting Percentage – ఏపీలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్నిచోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయులు పరస్పర దాడులు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడ క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు సిబ్బంది అనుమతిస్తున్నారు.

ఏపీలోని మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఆ టైమ్ వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటింగ్ ఛాన్స్ ఇస్తారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సీఈవో ముకేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదైంది.

You cannot copy content of this page

Scroll to Top