గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ

TRINETHRAM NEWS

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ఏప్రిల్ 11

గుడివాడ అక్రమమద్యం స్వాధీనం: టూ టౌన్ సి.ఐ

26 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేస్ నమోదు

ఈ రోజు గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి డౌన్ వద్ద అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు గా సమాచారం మేరకు గుడివాడ డిఎస్పి పి శ్రీకాంత్ పర్యవెక్షణలో గుడివాడ టూ టౌన్ సీఐ అయిన ఎం.ఎన్ దుర్గారావు గారి అధ్వర్యంలో గుడివడ టూ-టౌన్ టౌన్ ఎస్.ఐ అయిన పి. నాగరాజు పోలీస్ స్టేషన్ సిబ్బందితో 26 క్వార్టర్స్ మద్యం బాటిల్స్ ను అక్రమంగా కల్గి వున్న పోతురాజు సుదర్శన కుమార్ గుడివాడ అను అతని వద్ద స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ టూ టౌన్ సి.ఐ దుర్గారావు మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా మద్యం కల్గివున్న వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పినారు.

You cannot copy content of this page

Scroll to Top