ఎంపీ ఆదాలకు కృతజ్ఞతలు తెలిపిన నుడా చైర్మన్ ముక్కాల

TRINETHRAM NEWS

ఎంపీ ఆదాలకు కృతజ్ఞతలు తెలిపిన నుడా చైర్మన్ ముక్కాల

నెల్లూరు పార్లమెంట్ సభ్యుల, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ని నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గురువారం సాయంత్రం ఎంపీ ఆదాల కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనను నుడా చైర్మన్ గా ప్రభుత్వం రెండవసారి అవకాశం కల్పించిన నేపథ్యంలో అందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి, శాలువాకప్పి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు

You cannot copy content of this page

Scroll to Top