ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గన్ రాక్ ఏరియా లోని జయలక్ష్మి గార్డెన్స్ నందు నిర్వహించడం జరిగిది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మెజారిటీనైతే ఓడిపోయామే అంతకంటే ఎక్కువ మెజారిటీతో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్గిని గెలిపించి రేవంత్ రెడ్డి కి కానుకగా ఇస్తామని అదే విధంగా రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేసుకునే దిశలో కుత్బుల్లాపూర్ నియోజవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేసేలా ముందుండి నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతిరెడ్డి,పున్నారెడ్డి, జ్యోత్స్నా శివారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, కాంగ్రెస్ నాయుకులు, ఏ బ్లాక్ నాయకులు, బి బ్లాక్ నాయకులు మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యం
Related Posts
రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశం
TRINETHRAM NEWS రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశం మాలల ఒత్తిడితోనే ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 29వ తేదీనాడు రామగుండం ఎమ్మార్పీఎస్. ఎం ఎస్ పి మున్సిపల్ నూతన కమిటీ నియామకం…
పొలం బాటలో విద్యుత్ అధికారులు
TRINETHRAM NEWS పొలం బాటలో విద్యుత్ అధికారులు రచ్చపల్లి గ్రామం ,ధర్మారం మండలం లో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు వినియోగదారులతో మాట్లాడుతూ గ్రామం లో…