TRINETHRAM NEWS

గోపాలపురం,
10.03.2024.

గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేళ్ళచింతలగూడెం నుండి బేదంపూడి గంగాజలం, బేధంపూడి వెంకట్రావు, సాయిల బాబురావు, జొన్నకూటి సువర్ణ రాజు, కవులూరి చిన్న వెంకటరావు, కవులూరి పెద వెంకట్రావు, కుక్కల రామారావు తదితర 30 కుటుంబాల వరకూ టీడీపీ, జనసేన పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు: హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయం, యర్నగూడెం.