ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి

రాష్ట్ర ప్రజలందరికి సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ గురువారం ఉదయం 10 గంటలకు జరిగే జగనన్న జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసహభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

బుధవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యక్రమ వివరాలపై అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రజలందిరికి మెనిఫెస్టో అంటే గౌరవం పెంచిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలకు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జరుపుకుంటారని, అలాంటి జగనన్న జన్మదిన వేడుకలను అందరం సమిష్టిగా ఓ పండుగలా నిర్వహిద్దామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటడం, అన్నదానం, రక్తదానం, కేక్ కటింగ్, విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, పట్టాల పంపిణీ, నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహణ ఉంటుందని, కార్యక్రమానికి వచ్చే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు.

You cannot copy content of this page

Scroll to Top