TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 25
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇన్ని రోజులు.. ఈ స్కాంలో పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు విచారించారు. అయితే.. ఈ కేసులో సమాచారం కోసమే విచారణ చేస్తున్నామంటూ సీబీఐ ఓసారి.. ఈడీ పలు మార్లు విచారణ చేసింది.

అయితే.. మధ్యలో కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించగా.. ఆమె వెళ్లలేదు. ఈ క్రమంలోనే.. ఈడీ నోటీసులపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు కూడా. దానిపై ఇంకా కేసు నడుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది.

కాగా.. ఈసారి కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు కూడా పంపిం చింది. ఈ నెల 26న విచారణకు రావాలని.. సెక్షన్ 41ఏ కింద కవితకు నోటీసులు ఇచ్చింది సీబీఐ.

అయితే.. ఇన్ని రోజులు ఈడీ విచారణలకు డుమ్మా కొట్టిన కవిత.. ఇప్పుడు సీబీఐ విచారణకు కూడా డుమ్మా కొట్టనుంది. అయితే.. నోటిసులు, విచారణ విషయంలో సుప్రీం కోర్టు నుంచి స్పష్ట మైన తీర్పు వచ్చేంత వరకు తాను విచారణకు హాజరు కాబోనంటూ ఇప్పటికే కవిత తేల్చి చెప్పింది.

కాగా.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నోటీసులకు కూడా వెళ్లనంటున్నారు కవిత. ఇదిలా ఉంటే.. ఈడీ నోటీసుల కేసుపై ఈనెల 28న సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. సీబీఐ విచారణకు కవిత గైర్హాజరుకానున్నారు. అయితే.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. గతంలో కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్దే విచారించారు