Trinethram News : గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు భయంకరమైన వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం జర్నలిస్టులపై జరిగిన దాడులపై తక్షణమే, పూర్తిగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం, బాధ్యులను విచారించడం ప్రభుత్వాల బాధ్యత.
ప్రపంచంలోని ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి
Related Posts
Kim-Putin : కిమ్-పుతిన్ మధ్య రక్షణ ఒప్పందం
TRINETHRAM NEWS కిమ్-పుతిన్ మధ్య రక్షణ ఒప్పందం Trinethram News : ఉత్తర కొరియా : Nov 12, 2024, రష్యా, ఉత్తర కొరియా మధ్య రక్షణ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. రక్షణ అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని జూన్‌లోనే…
Blast in Pakistan : పాకిస్థాన్‌లో భారీ పేలుడు
TRINETHRAM NEWS పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 20 మంది మృతి..! Trinethram News : పాకిస్థాన్ : క్వెట్టా రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు ఈ ఘటనలో మొత్తం 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం స్టేషన్ నుంచి రైలు…