జూరాల బృందావనం గార్డెన్ అభివృద్ధికి వినతిపత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

TRINETHRAM NEWS

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ రాములు గారితో కలిసి నేషనల్ టూరిజం సెక్రటరీ శ్రీమతి విద్యావతి గారికి గద్వాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న జూరాల బృందావన్ గార్డెన్ అభివృద్దికి తొడ్పాటు అందించాలని నేషనల్ టూరిజం సెక్రటరికి వినతి పత్రం అందజేశారు.

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం రేవులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న జూరాల ప్రాజెక్టు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న బృందావన్ గార్డెన్ను స్వదేశి దర్శన్ పథకంలో భాగంగా అభివృద్ధి పనుల నిమిత్తం మరో 84 కోట్ల రూపాయలు కేటాయించాలని మూడు రాష్ట్రాలతో సంబంధం ఉన్న నడిగడ్డకు చారిత్రత్మాకత కలిగిన విద్వాత్గద్వాలకు గద్వాల పట్టు చీరలకు, ప్రాచీన కోటలకు, కృష్ణనది పరివాహక ప్రాంత దేవాలయాలకు, పర్యాటక ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నందున పర్యాటక అభివృద్ధిని పెంపొందించుటకు పర్యాటకుల సౌకర్యార్థము బృందావన్ గార్డెన్ అభివృద్ధి నిమిత్తం నిధులను మంజూరు చేయాలనీ జాతీయ టూరిజం సెక్రటరీగారికి వినతిపత్రం అందజేశారు, దీనికి గాను సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top