TRINETHRAM NEWS

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాల‌కు త‌ర‌లించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది.

ఈ స‌మ‌యంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవ‌లందించారు.

2 నుండి 3 అడుగుల లోతున ఉన్న‌ మంచులో న‌డుస్తూ.. 7 నుంచి 8 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను త‌ర‌లించారు.

వైద్యులు ఆమెను ప‌రీక్షించి ప్ర‌స‌వం చేశారు.