కాంగ్రెస్ పార్టీ నుండి మొట్టమొదటి ఎమ్మెల్యేగా జెడి శీలం కు దరఖాస్తు అందించిన రాజేష్
శనివారం బాపట్ల కాపు కళ్యాణ్ మండపం నందు బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజి బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రివర్యులు జె. డి శీలం విచ్చేసి పార్టీ కార్యచరణ పై నాయకులకు పలు సూచనలు అందించారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పఠాన్ రాజేష్ బాపట్ల నుండి మొట్టమొదటిగా జెడి శిలం కు తన దరఖాస్తులు అందించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఇప్పటివరకు పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశాం రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి బాపట్ల నియోజకవర్గం నుండి మరింత కృషి చేస్తామని పఠాన్ రాజేష్ జెడి శీలం కు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అనునిత్యం మైనారిటీలకు వెన్నుదన్నుగా తానంటున్నానని తెలిపారు. కులమత బేధాలు లేకుండా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కలిగించాలని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ప్రజా రంజకమైన పార్టీ అని ప్రజలందరికీ నమ్మకం ఉంది నన్ను మరింత ప్రోత్సహిస్తే ప్రజా రంజకమైన పాలన సాగిస్తానని ఆయన పేర్కొన్నారు. బాపట్ల నుండి మొట్టమొదటి దరఖాస్తు తనదవటం ఎంతో ఆనందదాయకమని రాజేష్ తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వ ఎమ్మెల్యేల తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారు తనకు ఒక్క అవకాశం కనుక ఇస్తే ప్రజలకు మంచి సేవలు చేసుకుంటూ పార్టీపై మరింత నమ్మకాన్ని ప్రజల్లో చిరస్థాయిగా ఉండేలా చేస్తానని పఠన్ రాజేష్ తెలియజేశారు..